రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పై పోరాడండి
బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన …
రంగు బాస్కరాచారి
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జమ్మికుంటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరంగా పోరాడని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.మరో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే కార్యచరణ రూపొందించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై పట్టణ కమిటీ సమిష్టిగా ఉద్యమించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి పట్టణంలో పార్టీని బలోపేతం చేసి మున్సిపాలిటీని కైవాసం చేసుకునే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి పట్టణ కమిటీని సంపత్ రావు అభినందించారు. ఈ కార్యవర్గ సమావేశంలో అనేక సమస్యలపైన చర్చించిన అనంతరం ప్రజా సమస్యలపైన ప్రజల పక్షాన ఉద్యమించాలని తీర్మానం చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరా చారి, ఎర్రబెల్లి సంపత్ రావు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, జమ్మికుంట జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, కోరే రవీందర్, ఠాగూర్ రాజేష్, పల్లపు రవి, దొంతుల రాజకుమార్, కొలకని రాజు, మోతే స్వామి,
తూడి రవిచందర్ రెడ్డి, ఇటుకాల స్వరూప ఎదులాపురం అశోక్, కొమ్ము అశోక్, పత్తి జనార్దన్ రెడ్డి, గండికోట సమ్మయ్య, మోడెం రాజు, ఠాగూర్ రాకేష్, బల్సుకూరి రాజేష్, కొండ్లె నాగేష్, బూరుగుపల్లి రాము, గర్రెపల్లి నిరూపారాణి, MDరజియా, ఇల్లందుల శ్రీనివాస్, ఏ రామస్వామి, బూత్ అధ్యక్షులు బూతు ప్రధాన కార్యదర్శు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.