మూఢ నమ్మకాలకు అంద విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం..

బహుజన సమాజం అనగా ఎస్సి, ఎస్టి, బీసిమై.నార్టీ కులాలకు చెందినవాల్లు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఐతే ఆ సమస్యలను పరిష్కరించేది పాలన కులాలని భావిస్తుంటారు. పరిష్కారం కాని సమస్యలకు కారణం, వారి పూర్వజన్మ సుకృతం అనో! లేక పై లోకంలో ఉన్న దేవుడనో!! లేక వాల్ల కర్మయనో!!! సర్ది చేప్పుకుంటారు. అయితే వారు తమ జీవితాల్లో వ్యవస్థ కొనసాగింపుకు కారకులు, పాలకులు అని అట్టి పాలకులను అంగీకరించిన మన బహుజన సమాజం కూడా అ వ్యవస్థ కొనసాగింపుటకు పరోక్షమైన సహాయకులు అని వారికి తెలియదు. ఈ వ్యవస్థ ఉన్నంత వరకు ప్రతి దినం ఉత్పన్నము అయ్యేటువంటి జీవన సమస్యలకు పరిష్కారము దొరకదు. ఈ వ్యవస్థ వల్ల లబ్ది చెందుతున్నటువంటి పాలక కులాలు ఈ వ్యవస్థను మార్చవు కనుక, ఈ వ్యవస్థను మార్చే బాధ్యతను బహుజన సమాజమే స్వీకరించాలి. అందుకొరకు ఒకవైపు పాలక కులాలతో పోరాటం చెయ్యాలి. మరోక వైపు వాడి మూఢ నమ్మకాలకు అంద విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయ్యాల్సి ఉంటుంది.ఏ సమాజంలోనైనా భాదితులైన ప్రజలు వారి సమస్యలకు సమాధానం పాలక కులాల నుంచి గాని, పరలోకంలో ఉన్న దైవం నుంచి గాని వస్తుందన్న బ్రమలో ఉన్నంతవరకు వారి సమస్యకు పరిష్కారం దొరకదు. వారి సమస్యలకు వారే పరిష్కరించడానికి భాధ్యతలు తీసుకొని, ఉద్యమిస్తారో అప్పుడే వాళ్లు ధాస్య విముక్తులు అవుతారు..

Join WhatsApp

Join Now