దేవాదుల ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లను నింపాలి
సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి
సిద్దిపేట ఆగస్టు 4 ( ప్రశ్న ఆయుధం ) :
దేవాదుల ప్రాజెక్టు ద్వారా మద్దూరు మండలంలోని లద్దునూరు రిజర్వాయర్ ను నర్మెట్ట మండలం వెల్దండ రిజర్వాయర్ ను నింపాలని కోరుతూ సిపిఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి మాట్లాడుతూ రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా మద్దూరు, దూల్ మిట్ట మండలాల్లోని చెరువులు కుంటలు నింపాలని అధికారులను డిమాండ్ చేశారు. వర్షాకాలం సగం అయిపో వస్తున్నప్పటికీ వర్షాలు సరిగా పడక బోరు లు,బావులలో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు పోసిన నార్లు ఎండిపోతున్నాయని ఈ రిజర్వాయర్ల కింద సుమారు 300 ఎకరాలు నాట్లు వేయకుండా ఉన్నారని దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున దేవాదుల అధికారులు వెంటనే స్పందించి రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా చెరువు కుంటలను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొండూరి ఎల్ల స్వామి నాయకులు రాగుల రవి, కొమ్మ భాస్కర్ ,గిల్ల కుమార్, పాకల రాములు, తాడురు సత్తయ్య,గుత్తి సిద్దులు, మానేపల్లి సుబాజీ, మానేపల్లి బాబు,చిలుక కిష్టయ్య ,అనిల్ తదితరులు పాల్గోన్నారు.