నోటీసులపై స్పందించిన సినీ నటుడు అలీ
తెలంగాణ : ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రముఖ సినీ నటుడు అలీకి గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం లీజుకు ఇచ్చానని అన్నారు. ఆ కట్టడాలపై లీజుకు తీసుకున్నవారే సమాధానం ఇస్తారని చెప్పారు. కాగా, వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో అలీకి ఫామ్ హౌస్ ఉంది.