గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తుంటే.. మరోవైపు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. ఇలా ఎవరి ధోరణిలో వాళ్లు తామే కరెక్ట్ అనేలా వాదోప వాదాలు వినిపించారు. ఇప్పటికే గ్రూప్ 1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకంగా మారింది.