చివరి దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు:

*చివరి దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు:*

*జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో ధాన్యం కొనుగోళ్లు, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలపై కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. రైతులు ఖాతాలో సుమారు 160 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అన్నారు. సన్న రకం ధాన్యానికి వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పత్తి 3.48 లక్షల హెక్టర్లలో పత్తి పంట పండింది. దాదాపు 11. 50 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం వుంది . ఇప్పటివరకు 1. 5 అధికారులు లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుకోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 22 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. జిన్నింగ్ మిల్ తనిఖీలు చేయాలని , పత్తి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిసిఐ ఇబ్బందులు గుర్తించి పరిష్కరించాలన్నారు. మాయిచ్చరు ఎఫెక్టివ్ ప్రకారం ఉండేలా చూడాలి రైతులకు పేమెంట్స్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో వసతి గృహాలలో, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు తహసిల్దార్ ఎంపీడీవోలు విధిగా సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ చార్జెస్ పెంచారని అన్నారు. నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో మధ్యాన్నం బోజనసమయంలో తనికీలు నిర్వహించి, విద్యార్థిలతో కలిసి భోజనం చేయాలనీ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో, వసతి గృహాల్లో ఎక్కడ వంట చేస్తున్నారు. వంటగది వంటగది స్థితి ఎలా ఉంది వంట సరుకులు ఎలా బియ్యం ఎలా భద్రపరుస్తున్నారు? వంటివి ప్రత్యేక తనిఖీలు చేయాలి. వండిన భోజనం ఎలా ఉంది, నీళ్లు సాంబారు, కూరగాయలు లేని కూరలు వండితే చర్యలు తీసుకోవాలి, పాఠశాల వసతి గృహాల్లో టాయిలెట్స్ పరిస్థితిలో అధ్యయనం చేయాలి. పాఠశాలన్నిటికీ మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డిఆర్ ఓ పద్మజారాణి, జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్, డిఎం డి సి ఎస్ కొండలరావు, పౌర సరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అదనపు పిడి డిఆర్ డి ఏ జంగారెడ్డి, ఆర్డీవోలు, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now