ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 3(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలంలోని ఉసిరిక పల్లి గ్రామంలో అంగన్ వాడి చిన్నారులకు ఆట వస్తువుల కోసం పది వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా శనివారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబురావు, కృష్ణారావు, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, జయంత్, కుమార్ ధర్మ రెడ్డి వేణు కుమార్ శ్యామ్ సుందర్ రావు, నవీన్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.