అనాధ యువతి వివాహానికి ఆర్థిక సహాయం

అనాధ యువతి వివాహానికి ఆర్థిక సహాయం చేసిన

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్ డిసెంబర్ 8 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆందోలు ఆలేఖ్య అనే యువతి వివాహానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అమ్మాయి చిన్న వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వివాహం ఖర్చులకు గాను ఆదివారం యువతికి 10000 రూపాయలను అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువతి సంరక్షకులు కష్ట సమయంలో మాకు సహాయం చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల సీనియర్ నాయకులు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చాడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, నాయకులు రామగౌడ్, బుచ్చిరెడ్డి, రాములు గౌడ్, అయ్యేలం, బాలయ్య, రాజు, రమేష్, కిష్టారెడ్డి, గోపాల్ రెడ్డి, నాంపల్లి, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now