వైష్ణవి వివాహానికి బాల్యమిత్రుల ట్రస్ట్ ద్వారా రూ. 25000/- ఆర్థిక సాయం

వైష్ణవి వివాహానికి బాల్యమిత్రుల ట్రస్ట్ ద్వారా రూ. 25000/- ఆర్థిక సాయం

ఎలిగేడు, డిసెంబర్20, (ప్రశ్న ఆయుధం )- ఎలిగేడు మండల్, ముప్పిరితోట గ్రామానికి చెందిన, పికిలిక శ్రీనివాస్ గౌడ్ మౌనిక దంపతుల కుమార్తె వైష్ణవి, వైష్ణవి తన చిన్నతనంలోనే తండ్రి శ్రీనివాస్ గౌడ్ అనారోగ్య కారణాల వలన మరణించడంతో, తల్లి మౌనిక కూలి పని చేస్తూ పిల్లలను పోషించడం జరుగుతుందని, నిరుపేద కుటుంబం కావడం వలన పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని వచ్చిన తెలంగాణ పత్రికలు కథనానికి స్పందించిన బాల్యమిత్రుల ట్రస్ట్. జి జే సి సుల్తానాబాద్ ట్రస్ట్ సభ్యులు రూ. 15,000/- రూపాయలు, వారి దగ్గర మిత్రుల ద్వారా మరో రూ. 10,000/- రూపాయలుతో వధూవరులకి వారి కుటుంబ సభ్యులకు వస్త్రాలు అందజేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు భవిష్యత్తులో ఇలాంటివి మా దృష్టికి వచ్చిన, మా వంతు ఆర్థిక సాయం అందిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు ఉప్పు తిరుపతి ఐ పీ ఎస్, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, ట్రస్ట్ సభ్యులు భూసారపు బాలకిషన్, ప్రసాద్ అడ్వకేట్, రామస్వామి, కరుణాకర్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, వీర లక్ష్మణ్, గంగాధర్ రెడ్డి, గజబింకర్ రవి, మరియు గ్రామస్తులు చీకటి సంతోష్ అడ్వకేట్, ఎనగందుల మల్లేశం, రంగు కొమరయ్య, పెద్ద పెళ్లి దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now