మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం 

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

– ఇద్దరికీ రూ.1.5లక్షల చొప్పున 3లక్షలు అందించిన ఈసీఐఎల్ రన్నర్స్ అసోసియేషన్

*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం ):*

ఇటీవల జిల్లాలోని గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకట్ లు మరణించిన విషయం అందరికి విదితమే. హైదరాబాద్ కు చెందిన ఈసీఐఎల్ రన్నర్స్ అసోసియేషన్ వారు ఇరు కుటుంబాలను పరామర్శించి రూ.1.5 లక్షల చొప్పున ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబాలకు మన ధైర్యాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో పిల్లలు మంచిగా చదువుకోవాలని సూచించారు. పిల్లల చదువుల కోసం భవిష్యత్తులో మరింత సహాయం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

IMG 20241229 WA0128 1 scaled

కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్సై ప్రేమ్ దీప్, ఈసీఎల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, ములుగు రఘు, శ్రీకాంత్ పిళ్లి, టి.శ్రీనివాస్, శివ, ఆనంద్ మోహన్, వెంకటేష్, వెంకటేష్ నాయుడు, మిథున్ తో పాటు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now