కేరళ వయనాడు వరద బాధితులకు ఆర్థిక సహాయం

IMG 20240825 WA2463

 

కేరళ వయనాడు వరద బాధితులకు ఆర్థిక సహాయం నిధి వసూలు క్యాంపెయిన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం గ్రామంలో చేయడం జరిగిందని సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో భారీ వరదలు కారణంగా వయనాడు లో కొండలు విరిగి అనేకమంది పేద ప్రజలు మరణించడం జరిగిందని ఆ యొక్క వరద బాధితులకు సహకరించిన దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, లక్ష్మీనగరం మాజీ సర్పంచ్ సాయిరాం రాజమ్మ, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, మహమ్మద్ బేగ్, మాజీ ఉపసర్పంచ్ గుడ్ల రామ్మోహన్ రెడ్డి, జి తాతారావు, మద్ది శ్రీనివాస్ రెడ్డి, డింగి గురుమూర్తి, శీరపు శివ కాంత్ రెడ్డి, ఇంకా తదితరులు పాల్గొన్నారు

ఇట్లు

సిపిఎం పార్టీ దుమ్మగూడెం మండల కమిటీ

Join WhatsApp

Join Now