పాఠశాల విద్యార్థులకు ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
హైదరాబాద్ కి చెందిన శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం.
శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు రెండు లక్షల ఆరు వేల రూపాయల విలువ గల బియ్యం, నిత్యవసరవస్తులు అందజేత హైదరాబాద్ కు చెందిన ప్రముఖ శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో
మణుగూరు మండల పరిధిలోని సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు మంగళవారం నాడు రెండు లక్షల ఆరు వేల రూపాయల విలువ గల బియ్యం, నిత్యవసరవస్తులు సబ్బులు మంచి నూనె డబ్బాలు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి ఆర్థిక సహకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకించి పేద విద్యార్థులు చదువుతో తమ జీవితాలకు బంగారు బాట వేసే విధంగా సంస్థ తోడ్పాటున అందిస్తుందన్నారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మణుగూరు లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా మూడు పూటలా కడుపునిండా భోజనం చేసే విధంగా నిత్యవసర వస్తువులు బియ్యం అందజేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ సహకారంతో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు కళలలో కూడా చక్కగా రాణించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు, శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చదువుకు దూరమైన ఎంతో మంది గిరిజన విద్యార్థులను చేరదీసి ఈ పాఠశాల నిర్వహిస్తున్నామని అన్ని విధాలుగా సహకరిస్తున్న శ్రీనివాసన్ మునుస్వామి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి కి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రమావత్ వెంకటేశ్వర్లు, ఉల్లెందుల సురేష్, జంపాల శ్రీనివాస్, దుగ్యాల సుధాకర్, తూముల తరుణ్ కుమార్,సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, జంపాల రఘు, దీపక్,పాఠశాల సిబ్బంది సుహాసిని దేవి, స్వాతి, కావేరి, రాధా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment