*మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత*
*ఆపదలో అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*
చిన్న నాడు కలిసి చదువుకున్న తోటి మిత్రుడు చనిపోవడంతో మిత్రుని కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను మిత్ర బృందం అందించారు వివరాల్లోకి వెళితే జమ్మికుంట పట్టణానికి చెందిన నిమ్మ కుమార్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గతంలో అతనితో పాటు కలిసి చదువుకున్న పదవ తరగతి స్నేహితులు మృతిచెందిన కుమార్ కుటుంబ సభ్యులకు రూ25 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుమార్ తో పాటు పదవ తరగతి చదువుకున్న 92 – 93 బ్యాచ్ మిత్రులు ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి స్నేహం అంటే ఇదేరా అని నిరూపించారు నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్ డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇటీవల అనారోగ్యంతో కుమార్ మృతిచెందగా అతని స్నేహితులు కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకొని తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు చిన్నింటి నాగేంద్ర పొనగంటి ప్రభాకర్ అయిత వేణుగోపాల్ రాజ్ కుమార్ జూపాక శ్రీనివాస్ రాజ్ కుమార్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
*మృతుడి కుటుంబానికి సాటి డ్రైవర్ల చేయూత*
అనారోగ్యంతో మృతి చెందిన నిమ్మ కుమార్ కుటుంబానికి తన సహచర డ్రైవర్లు రూ 15 వేలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారు 15 వేల రూపాయలను అందించి మానవత్వం చాటుకున్నారు.