నేస్తం వెల్ఫేర్ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

IMG 20240928 WA3057

 

బూర్గంపాడు: మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గండ్రగొడ్డలిపల్లి గ్రామానికి చెందిన మేడిజర్ల సీతకి రూ 8వేల ఆర్థిక సాయం అందించారు. సీత భర్త గత రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఈమెకు ఇద్దరూ కుమారులు నవీన్, వికాస్లు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తండ్రి చనిపోవడం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా వున్నందున పెద్ద కుమారుడు నవీన్ చదువు ఆపేసి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ తల్లి సీతకి ఆసరాగా ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ కనీసం చిన్న కొడుకునైన చదివించాలని, చదువుతోనైన వాళ్ళ తలరాత మారుతుందనే ఉద్దేశ్యంతో డిగ్రీ చదివిస్తున్నారు. కూలీ పనికి వెళ్తే కానీ పూట కూడా గడవని పరిస్థితి వారిది. అలాంటి పరిస్థితుల్లో గత 8 నెలల నుండి సీతని కూడా క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటునప్పటికీ అనారోగ్యంతో బాధపడుతూ కూలీ పనులకు వెళ్ళకపోవడంతో కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. తమకు వున్నా చిన్నపాటి పూరీ గుడిసె కూడా వర్షాలకు దెబ్బతినడంతో వుండటానికి ఇల్లు కూడా లేక దాతలు సహాయం చేయగలరని వేడుకుంటుంది. వీరి కుటుంబ దయనీయ పరిస్థితి మా నేస్తం ట్రస్ట్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ 8 వేల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చింత అంకిరెడ్డి, సభ్యులు అవుల నాగార్జున, జింకల రాంగోపాల్ రెడ్డి, సంకా సురేష్, డి బాల నారాయణరెడ్డి, స్థానిక గ్రామస్తులు బర్ల ప్రభాకర్, పొండు శ్రీను తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now