మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత
బస్ స్టాండ్ సందర్శన,సమస్యలు పరిష్కరిస్థాం
ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం
బండి ట్రాప్ లో ఈటల,ఈటెల ట్రాప్ లో బండి కాదు,బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్
హుజురాబాద్ జూలై 24 ప్రశ్న ఆయుధం
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం రోజున హుజురాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ ను సందర్శించారు.ఈ సందర్భంగా బస్ స్టాండ్ లో ఉన్న పలు సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి,పరిష్కరిస్తానని తెలిపారు.అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలకు ఉచిత టికెట్ లను ఇచ్చామని,6,800 కోట్ల ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని,ఇదొక చరిత్ర అని హుజురాబాద్ డిపో పరిధిలో దాదాపు 1,34,02,821మందికి సుమారు 53 కోట్లు ప్రయాణ ఛార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో చేసి చూపెట్టిందని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని,విమర్శించనవారే కితాబు ఇస్తున్నారని తెలిపారు మహిళలను ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మహిళా సంఘాలకు బస్ నడుపుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం నుండి కల్పించామని విజయవంతంగా పథకాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
దళిత బంధు ఆపింది కౌశిక్ రెడ్డి..
దళిత బంధు విషయంలో కౌశిక్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని,ఉప ఎన్నికల సమయంలో ప్రారంభమైన దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో అందరికి ఇవ్వకుండా కౌశిక్ రెడ్డి కుట్రలు చేశారని ప్రభుత్వ విప్ గా,ఎమ్మెల్సీ గా ఉండి ఆనాడు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని కోరారు కేవలం ఓట్ల రాజకీయం కోసం వారిని వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోపే దళిత సంఘాల నాయకులకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్యపై పలు దఫాలు చర్చించగా గత జనవరిలో ఫ్రీజింగ్ ఎత్తివేశామని,ప్రభుత్వంలో ఉండి చేయలేక ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని,దళితులు ఎవరు అధైర్యపడిద్దని ఆలస్యమైన అర్హులైన ప్రతి లబ్దిదారునికి దళిత బంధు నిధులు అందజేస్తామని,దళారులను నమ్మి మోసపోవద్దని అని కోరారు
ఇల్లిస్తాం,ప్రభుత్వ పథకాలను అందరికీ అందజేసేలా కృషి చేస్తా.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని,ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మింగుడు పడడం లేదని,అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ళు అయినా హుజురాబాద్ పేద ప్రజలకు ఇచ్చాడా అని ప్రశ్నించారు?కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పంచలేదని,ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో 3500 ఇళ్లను మొదటి విడతగా అందజేశామని,బేస్మెంట్ వరకు పూర్తైన ఇళ్లకు డబ్బులు కూడా పడ్డాయని,మొదటి కౌశిక్ రెడ్డి కళ్ళు పెద్దగా చేసి చూస్తే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కనిపిస్తాయని కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు సన్నబియ్యం,రేషన్ కార్డులు,ఆరోగ్య శ్రీ,రైతు భరోసా,రుణమాఫీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు
బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి,స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..
బీజేపీ నాయకులు బండి సంజయ్,ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న అంతర్గత పార్టీ విషయాల్లో కౌశిక్ రెడ్డి దూరడం చూస్తే బీజేపీ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడుతున్నాడని అందుకే బండి సంజయ్ కు మద్దతుగా మాట్లాడుతున్నాడని ప్రణవ్ ఆరోపించారు బీజేపీ,బీఆర్ఎస్ దొందూ దొందే అని ఎలక్షన్ నుండి చెప్తున్న అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే నిజమని తెలుస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 మండలాల్లో,2 పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందనీ ధీమా వ్యక్తం చేశారు.