ఆపదలో ఉన్నవారికి ఆపన్న ఆస్తం అందజేసిన
కోడి ఉపేందర్
పేద కుటుంబానికి ఆర్థిక భరోసా
హాస్పిటల్ ఖర్చులకు 5000 అందజేత
ప్రశ్న ఆయుధం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డిసెంబర్ 20
హుజూర్ నగర్
పట్టణ పరిధిలోని రెండో వార్డుకు చెందిన తురకభద్రమ్మ భర్త తురక గోపయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి
హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు కోడి ఉపేందర్ వారి కుటుంబ ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికనికి తోడుగా ఆ కుటుంబం అనారోగ్యం పాలవడం చాలా బాదను కలిగిస్తుందని వారికి నావంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో గొల్ల గోపు గురుమూర్తి యూసఫ్ కంప గోపి మర్రిపల్లి కార్తీక్ కళ్యాణ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.