“విద్యార్థికిఆర్థిక చేయుత”..!!!

*అర్య వైశ్య విద్యార్ధికి ఆర్థిక చేయుత*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 27*

కరీంనగర్ పట్టణం లోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన నార్ల అరుణ్ కుమార్ ఇంజనీరింగ్ విద్యార్థికి పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు ఆర్థిక చేయూత అందించారు అరుణ్ కుమార్ తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు . ప్రస్తుతం కొండగట్టు లోని జె ఎన్ టి యు లో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న అరుణ్ కుమార్
హాస్టల్ ఫీజు కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితి తలెత్తడంతో తల్లితండ్రులు కరీంనగర్ పట్టణ అర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ని కలిసి అబ్బాయి చదువుకి సహాయం చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన పట్టణ అర్య వైశ్య సంఘం నేతలు మంగళవారం కరీంనగర్ లోని కార్యాలయములో అరుణ్ కుమార్ కు 6500/- రూపాయలతో పాటు బ్యాగ్ నోట్ బుక్స్ అందజేశారు. అలాగే
పట్టణ అర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ రు.5000 పడమటింటి సంతోష్ కుమార్ రూ.1000 కోశాధికారి సూద్దాల వెంకటేష్ రూ.500
వాణిజ్య విభాగం ఛైర్మెన్ తోడుపునూరి హరి ప్రసాద్ బ్యాగ్ నోట్ బుక్స్ లను అందించారు.
ఈ కార్యక్రమం లో పట్టణ యువజన సంఘం అధ్యక్షులు తణుకు సాయికృష్ణ పట్టణ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి కొంజర్ల శ్రీకాంత్ కార్యదర్శి ఏలిమేళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now