సహుద్యోగులకు ఆర్థిక వితరణ

సహుద్యోగులకు ఆర్థిక వితరణ

*సహచరుల పట్ల సానుభూతితో నిలిచిన సింగరేణి ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్*

*మణుగూరు సింగరేణి ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ చేత సవుద్యోగులకు రూ.66,600 ఆర్థిక సహాయం.

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 15 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘనమైన సంఘటన చోటుచేసుకుంది. సింగరేణి ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలసి, తమ సహచర ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతి చూపుతూ ఒక ఆత్మీయమైన ఉదాహరణ సృష్టించారు.ఇటీవల ఎం. రాజనర్సు, ఎం. విశ్వేశ్వరరావు ల తండ్రి మాటేటి నరసయ్య మరణించగా, బి. రమేష్ బాబు తల్లి, తండ్రి ఇద్దరూ కేవలం వారంరోజుల వ్యవధిలోనే కన్నుమూయడం కుటుంబాలకు తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దుఃఖ సమయంలో మేమున్నాం మీరు ఒంటరిగా లేరు అనే ఆత్మీయతను తెలియజేస్తూ తోటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ స్వచ్ఛందంగా సహకరించారు.

తమ తక్కువ వేతనాల మధ్యనుండే సాయం అయినా, వారి హృదయాల విశాలతను ప్రతిబింబించేలా మొత్తం రూ. 66,600 రూపాయలను సేకరించి అందజేశారు.అందులో

ఎం.రాజనర్సు కు రూ.16,900,

ఎం. విశ్వేశ్వరరావు కు రూ. 16,900,

బి. రమేష్ బాబు కు రూ. 32,800 రూపాయలు అందించారు.ఈ సంఘటన మానవతా విలువలను, సహోద్యోగుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తూ,సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది.

తమ సహచరుల కష్టసుఖాల్లో భాగస్వాములవ్వడం ద్వారా ఈ సెక్యూరిటీ గార్డ్స్ నిజమైన సామాజిక బంధం అంటే ఏమిటో చాటిచెప్పారు.స్థానిక ప్రజలు, అధికారులు, సహోద్యోగులు ఈ మానవీయ చర్యను ఘనంగా అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో. సింగరేణి అధికారులు,ఎస్ & పి సి, జమిదారులు,ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్స్, రామవుతార్, డి సుధాకర్, ఎస్.కె రబ్బాని, మరియు ఎస్ &పి సి, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment