నిజామాబాద్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నిజామాబాద్, నవంబర్ 26 (కృష్ణ ఆయుధం): నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ రారణాసి రంజిత్ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందని తెలిపారు.
సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్‌హెచ్‌ఓ హరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం సమయంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
—