పరుగు పందెంలో ప్రథమ స్థానం

పరుగు పందెంలో ప్రథమ స్థానం

ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 19, కామారెడ్డి :

గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం కల్పించేందుకు నిర్వహించే సీఎం కప్ క్రీడల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి విద్యార్థి డి. భరత్ రాజ్ (బీకాం కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం) 400 మీటర్ల పరుగు పందెంలో, క్రాస్ కంట్రీ 10కిమీ ల విభాగాలలో వరుసగా ప్రథమ స్థానంలో నిలిచి పథకాలు గైకొని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ఇన్చార్జి పిడి డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా ఇటీవల తెలంగాణ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్ కళాశాల 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్టు తెలిపారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థి డి.భరత్ రాజ్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య, ఇన్చార్జి పిడి డాక్టర్ జి. శ్రీనివాసరావు ఎన్ సిసి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ. సుధాకర్, ఏ. రాజేందర్, కే.శ్రీనివాస్, బాలాజీ అధ్యాపకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now