*ఆక్రమoగా లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా సబ్యుల అరెస్ట్ చేసిన కామారెడ్డి జిల్లా పోలీసులు*
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
తేదీ 10.10.2024 నాడున రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ తండ్రి సుదర్శన్ అని వ్యక్తి తన ఇంటి యందు ఆక్రమముగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం మేరకు జిల్లా యస్ పి ఆదేశాను సారం సి.సి.యస్ పోలీసు వారి అద్వారయములో రాజంపేట పోలీసు వారు బల్ల రవీందర్ ఇంటి యందు సోదాలు నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమయములో వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళకు లింగానేర్దరణ చేస్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగినది. బల్ల రవీందర్ గతములో రాజాంపేట్ నందలి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు కామారెడ్డి నందలి కౌసల్య ఆసుపత్రి నందు ఈ స్కానింగ్ విభాగములో పనిచేసినాడు. 2021 సం. లో కౌసల్య హాస్పిటల్ సీజ్ అవ్వడంతో అతను వేరే అక్రమ మార్గాలను ఎంచుకొని ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్ లో ULTRA SOUND స్కానర్ గురించి తెలుసుకొని వారిని సంప్రదించి బల్ల రవీందర్ వద్ద అవసరమగు అనుమతులు లేకపోవడంతో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి ULTRA SOUND స్కానర్ ను అమ్మినారు. దీనిని బల్ల రవీందర్ ఎవరికి అనుమానం రాకుండా తన ఇంటి యందు ఉంచి తనకు తెలిసిన ఇట్టి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేయుచున్నాడు.
నేరస్తుల పూర్తి వివరాలు.
A1. Balla Ravinder S/o Sudharshan Age:38 years, Cast:Padmashali, Occp:Beedi labour, R/o Rajampet village & Mandal.
A2. Potala Samson S/o Kondaiah, Age:49 years, Cast:SC-madiga, Occp:Sam medical Systems Director, R/o Khudus nagar, Gandhi nagar, Vijayawada urban , AP state.
A3. Chinthalapoodi Durga Prasad S/o Simhachalam, Age:25 years, Cast:Padmashali, Occp: Private Employee, R/o Chithalapoodi Apparam veedhi, Prakash Nagar, Sundaraiah Nagar, Krishna Dist, AP state.
A4. Boini Yadagiri S/o Siddaramulu, Age:39 years, Cast:Mudhiraj, Occp:RMP-Gidda, R/o PMH colony Kamareddy Town & Dist. .
A5. Bakki Praveen Kumar S/o Balaiah, Age:36 years, Cast:Chakali, Occp:RMP-Gottimukkula, R/o Narsannapally village of Kamareddy Mandal & Dist.
పై నేరస్తులలో A1. పరీక్షలు నిర్వహిస్తాడు. A2. & A3. అల్ట్రా సౌండ్ మిషన్ అమ్మినవారు. A4 & A5 లు గర్భిణీ మహిళలను మరియు తెలిసిన వారిని లింగ నిర్ధారణ పరీక్షలు చెపిస్తామని A1 వద్దకి తీసుకవస్తారు. ఇట్టి కేసులో పైన తెలిపిన 5 గురు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపబడును. పైన నేరస్తుల ఒప్పుకోలు ప్రకారం రిమాండ్ రిపోర్ట్ నందు 14 మంది ఇట్టి కేసులో నేరస్తులుగా గుర్తించడం జరిగింది. వారిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
స్వాదీనపరచుకున్న వాటి వివరాలు.
1) అల్ట్రా సౌండ్ (MINDRAY COMPANY)
2) TRANDUCER CABLE (PROBE)
3) పవర్ కేబుల్
4) మొబైల్ ఫోన్
ఈ కేసులో చురుకుగా పాల్గొని పైన తెలిపిన నిందితులను అరెస్ట్ చేయదములో మరియు అల్ట్రా సౌండ్ స్కానర్ మరియు మిగితా వాటిని స్వాదీన పరచుకున్న సి.సి.యస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, భిక్నూర్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ , రాజంపేట యస్ ఐ పుష్పరాజ్, సి.సి.యస్ యస్ ఐ ఉస్మాన్ మరియు సిబ్బందిని జిల్లా యస్పి అభినందించడం జరిగినది.
ఇకపై ఎవరైనా ఇలాంటి ఆక్రమముగా లింగ నిర్దారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన మైన చర్యలు తీసుకోబడును. ఎక్కడైనా ఆక్రమముగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారని తెలిసన వెంటనే డయల్ 100 కి గాని, పోలీస్ కంట్రోల్ నం . 8712686133 కి గాని, సంభందిత పోలీసు వారికి సమాచారం తెలుపగలరు. వారి వివరములు గోప్యముగా ఉంచబడుతాయి.