పెద్దగట్టు జాతరకు ఐదు కోట్ల నిధులు విడుదల ..!!

*_పెద్దగట్టు జాతరకు ఐదు కోట్ల నిధులు విడుదల ..!!_*

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది.

జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ..ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని పూజారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తించబడిన పెద్దగట్టు జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో దూరాజ్‌పల్లిలోని పెద్ద గట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తుంది. జాతరకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని,ఈ నేపథ్యంలో మౌలిక వసతులు,విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లకు నిధులు వినియోగించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment