ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి.
రాజస్థాన్ లోని జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భాంక్రోటా ప్రాంతంలో హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్ ను ట్రక్ ఢీ:కొట్టడంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్కు వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఘటనలో 24మంది తీవ్రంగా గాయపడ్డారని, ఐదుగురు కన్నుమూశారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని, చనిపోయినవారి శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు.