సిద్దిపేట జిల్లాకు ఐదు మంది ప్రొబిషనరి ఎస్సైలు

సిద్దిపేట
Headlines:
  1. సిద్దిపేట జిల్లాకు ఐదు ప్రొబిషనరీ ఎస్సైలు: శిక్షణ పూర్తిచేసి చేరిన వారు
  2. పోలీసు కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ప్రొబిషనరీ ఎస్సైలను అభినందించారు
  3. సిద్దిపేటలో నూతన ఎస్సైలు: విధి నిర్వహణలో క్రమశిక్షణ, నైతికతను ఉత్కృష్టంగా పాటించండి
  4. నూతనంగా చేరిన 5 ప్రొబిషనరీ ఎస్సైలు: శిక్షణ, విధుల్లో నిరంతరం నిబద్ధత
  5. సిద్ధిపేట జిల్లాకు చేరిన కొత్త పోలీస్ అధికారులు: విధుల్లో అలసత్వం వహించవద్దని హెచ్చరిక

* శిక్షణ పూర్తి చేసుకుని నూతనంగా జిల్లాకు వచ్చిన 5 మంది ప్రొబిషనరీ ఎస్ఐలు ఈరోజు మర్యాదపూర్వకంగా సిపిని కలిసి మొక్కను అందజేత*

శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ప్రొబిషనరీ ఎస్ఐల వివరాలు*

1 కే మానస, 2 పి రేణుక, 3 వీ నవీన్, 4 బి సౌజన్య, 5 ఏ సమత  

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ ఎస్ఐ ఉద్యోగం సాధించి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చినందుకు అభినందించారు. ప్రొబిషనరీ ఎస్ఐలకు ఒక నెల రోజుల శిక్షణ గురించి దుబ్బాక, అక్కన్నపేట, దౌల్తాబాద్, మద్దూర్, జగదేవపూర్ పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment