ప్రభుత్వ పాఠశాలలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి
– డీఈవో కు వినతి పత్రం అందించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డి ఈ ఓ రాజు కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళితే సమస్యలు స్వాగతం పలుకుతాయని, కనీస మౌలిక సదుపాయాలు మూత్రశాలలు మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వర్షానికి చెడిపోయిన ఆటస్థలం తరగతి గదులను వెంటనే శుభ్రపరచాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శి నితిన్ నాయకులు మణికంఠ, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.