కురిసిన భారీ వర్షాలు, వరదల వలన పాడైన అయినవి తొందరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11:
ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాలు, చెరువులు, కుంటలు, త్రాగునీటి వసతుల తాత్కాలిక మరమ్మతులకు అవసరం అయిన నిధుల కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన వర్షాల వలన వివిధ రహదారులు, కాల్వలు, కల్వర్టులు, తరగతి గదులు , తదితర దెబ్బతిన్న రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్న వాటిని తాత్కాలిక మరమ్మత్తులకు అవసరమైన నిధులు కొరకు ప్రతిపాదనలు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉత్తర్వులకు లోబడి ప్రతిపాదనలు సిద్దంచేసి వెంటనే సమర్పించాలని తెలిపారు. మున్సిపల్, పంచాయతీ, రోడ్లు భవనాల శాఖలకు చెందిన రోడ్లు, కాల్వలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటిని తాత్కాలికంగా మరమ్మతులకు ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లు సుజాత,శ్రీహరి డీఈఓ రాజు, ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, పంచాయతీ రాజ్ ఈఈ బావన్న, నీటి పారుదల శాఖ ఈ ఈ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.