Site icon PRASHNA AYUDHAM

గజ్వేల్ పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్

IMG 20241221 WA0685

గజ్వేల్ పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్

శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్

గజ్వేల్ డిసెంబర్ 21 ప్రశ్న ఆయుధం :

భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన (ఆర్ఏఎఫ్) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు, మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో హాకింపేట, సికింద్రాబాదులలో 99 బెటాలియన్ కలిగి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఆదేశానుసారం శనివారం గజ్వేల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల సమస్య, మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం, ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, మేమున్నాము అనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి ఇందిరాపార్క్ చౌరస్తా, కోట మైసమ్మ, పిడిచేడు రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ సైదా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, తొగుట సిఐ లతీఫ్, గజ్వేల్ ఎస్ఐలు యాదవ రెడ్డి, శంకర్, ఆర్ఎఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది 84 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.

Exit mobile version