శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి
తప్పిన ప్రమాదం!
సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ ప్రతినిధి,జనవరి 04, ప్రశ్న ఆయుధం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది! దీంతో పైలట్ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆందోళన రేకెత్తించింది.