Site icon PRASHNA AYUDHAM

వరద బాధితులకు దుప్పట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ

బాధితులకు
Headlines in Telugu:

అల్లాపూర్ డివిజన్ లో వరద బాధితులకు దుప్పట్లు మరియు నిత్యవసరలో సరుకులు పంపిణీ చేసిన

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 30: కూకట్‌పల్లి ప్రతినిధి 

వరద బాధితులకు దుప్పట్లు మరియు నిత్యవసరలో సరుకులు పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ ప్రతినిధులు.

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో వరద బాధితుల సహాయార్థం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ గ్రాంట్ తో వరద బాధితులకు దుప్పట్లు మరియు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమము జరిగినది .

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ డి . కోటేశ్వరరావు , రీజినల్ చైర్ పర్సన్ వి . శ్రీనివాసరావు , సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ సురేష్ జగనేని , లైన్స్ క్లబ్ బంజారాహిల్స్ , లైన్స్ క్లబ్ ఆఫ్ మెగాసిటీ ప్రతినిధులు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, బండారి ప్రసన్న ఆంజనేయులు పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version