గుమ్మడిదలలో పొలాలను పరిశీలించిన ఫ్లోరియన్ వాగ్నర్

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలోని రైతు హనీఫ్ కు చెందిన పంట పొలాలను బుధవారం ఈవీపీ, పోర్ట్‌ఫోలియో అండ్ ఇన్నోవేషన్ అధికారి ఫ్లోరియన్ వాగ్నర్ పరిశీలించారు. కాగా రైతు హనీఫ్ ప్రస్తుతం 12 ఎకరాల్లో బీరకాయ సాగు చేస్తూ ఆధునిక విధానాలను అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరియన్ వాగ్నర్ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన సాగు విధానాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడం ప్రశంసనీయమని, ఇటువంటి రైతులు వ్యవసాయ రంగానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రైతు హనీఫ్ తన పొలాల్లో బీరకాయ సాగు, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే సాంకేతికతలను వినియోగించుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారులు, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రైతులు రంగారెడ్డి, ఆలేటి వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, రాములుగౌడ్, శ్రీశైలం, కుమార్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment