ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయండి
హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ను సక్సెస్ చేయండి
బిజెపి నేత, మాజీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్ ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం
రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలని పార్టీ సూచన మేరకు ఆగస్టు 10 నుండి 15 వరకు చేపట్టాల్సిన తిరంగా యాత్ర ప్రోగ్రాంలను సక్సెస్ చేయాలని బిజెపి నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు పిలుపునిచ్చారు బిజెపి ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో గురువారం రోజున తిరంగా అభయాన్ సన్నాక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన మాజీ మేయర్ మాట్లాడుతూ ప్రజలతో కలిసి తిరంగా యాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని దేశభక్తి పూరిత కార్యక్రమాలు చేపట్టేలా ప్రోగ్రాములు నిర్వహిస్తూ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలని సూచించారు ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణంగా
నిలిచిందని యావత్ ప్రపంచమే భారత్ ధైర్య సాహసాలు , శక్తి సామర్ధ్యాలను చూసి నివ్వరపోయిందన్నారు సింధూర్ తో దేశ ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోతుందన్నారు అందుకే పంద్రాగస్టు వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేలా పార్టీ నాయకత్వం కార్యక్రమాలను రూపొందించిందని అందులో భాగంగా ఆగస్టు 10 నుండి 15 వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెద్ద సంఖ్యలో ఉండేలా చూడాలన్నారు. మన త్రివిధ దళాలను ప్రశంసిస్తూ వీరుల త్యాగాలను గుర్తిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని సూచించారు. 13 నుండి 15వ తేదీ వరకు పార్టీ కార్యకర్తలు అందరి ఇంటిపై, కార్యాలయాల భవనాలపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని, సాధ్యమైనంతవరకు పిల్లల చేత జెండాలు ఎగర వేయించాలన్నారు. ఆగస్టు 12 నుండి 14 వరకు స్వాతంత్ర పోరాటకు స్మారక చిహ్నాలు, స్వాతంత్ర ఉద్యమంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు , యుద్ధ స్మారక చీనాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టి, మహనీయులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించే ప్రోగ్రాములు నిర్వహించాలన్నారు. మాజీ సైనికులు, అమరవీరులు, మాతృభూమి సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను సన్మానించాలని, ఆగస్టు 14న విభజన గాయాల మృతి దినం సందర్భంగా తగిన బ్యానర్లు , ప్లకార్డులతో మౌన ప్రదర్శనలు , మీటింగ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రోగ్రామ్లలో ప్రజా ప్రతినిధుల క్రియాశీలక భాగస్వామ్యం ఉండేలా చూడాలని తెలిపారు. బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడానికి పార్టీ శ్రేణులు అందరూ తగిన కృషి చేయాలన్నారు. ఇట్టి సమావేశంలో ఈస్ట్ జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి మాసం గణేష్ , మాజీ కార్పొరేటర్ లెక్కల వేణు , పాశం తిరుపతి , రాజు , బెల్లం నరేందర్ , సాగర్, అనిల్ తదితరులతోపాటు ఈస్ట్ జోన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.