వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై… తక్షణం దృష్టి సారించండి..!

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై…

తక్షణం దృష్టి సారించండి!

చంద్రబాబుకు APUWJ వినతి!

…dcm పవన్ తో ను భేటీ

అమరావతి, డిసెంబర్ 30:

పెండింగులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై వెంటనే దృష్టిసారించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు APUWJ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరుతూ APUWJ పంపిన వినతికి

సోమవారం సాయంత్రం సి.ఎం. కార్యాలయం స్పందించింది!

దాంతో రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు సోమవారం రాత్రి ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై ఒక వినతిపత్రాన్ని అందచేసారు.

అర్హులందరికీ అక్రెడిటేషన్ సదుపాయాన్ని కల్పించడంపై తక్షణం దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు.

అక్రెడిటేషన్, ఆరోగ్యబీమా, ప్రమాద బీమా, వెల్ఫేర్ ఫండ్, ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణం , దాడుల నివారణకు ప్రత్యేక చట్టం, ప్రెస్ అకాడమీ , ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు, వంటి అంశాలు ఆ వినతిపత్రంలో ఉన్నాయి!

ఆయా అంశాలను ఐ.వి.సుబ్బారావు ముఖ్యమంత్రికి వివరించారు.

గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒక సానుకూల వాతావరణం ఉందని, అయితే సమస్యల పరిష్కారం విషయంలో కొంత జాప్యం జరుగుతోందని ఐ.వి.సుబ్బారావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.

సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను ప్రాధాన్యత గల అంశాలుగా తీసుకొని పరిష్కారాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సీనియర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తీసుకున్న చర్యలపై తనకు వెంటనే నివేదించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐ.వి.సుబ్బారావు తో పాటు APUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్.రాంబాబు కూడా ఉన్నారు.

డిప్యూటీ సి.ఎం. పవన్ కళ్యాణ్ తో..

APUWJ నేతల భేటీ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ APUWJ బృందానికి హామీ ఇచ్చారు.

సోమవారం APUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, రాష్ట్ర నాయకులు వి. వెంకటేశ్వర్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

దానిపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now