Site icon PRASHNA AYUDHAM

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్…!!

IMG 20240829 WA0023

*తెలంగాణకు మరో 31ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు*

*జాబితాలో 10 నగరాలు, పట్టణాలు*

*మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం ఫోకస్‌!*

*ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం.. ఉపాధి అవకాశాలు*

తెలంగాణకు మరో 31 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు రానున్నాయి. రాష్ట్రంలో నగరాలుగా అభివృద్ధి చెందిన పలు పట్టణాలు.. వ్యాపారాలు, వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటి వరకు ఈ సదుపాయం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 10 నగరాల్లో 31 ఎఫ్‌ఎం స్టేషన్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ భేటీలో దేశవ్యాప్తంగా 234 నగరాల్లో 730 ఎఫ్‌ఎం స్టేషన్లకు ఆమోదం తెలపగా.. ఆ జాబితాలో తెలంగాణకు చెందిన 10 నగరాలున్నాయి.

ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎఫ్‌ఎం స్టేషన్లకు అవకాశం కల్పించింది. అయితే.. తెలంగాణలో మాత్రం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎఫ్‌ఎంకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం అందించడంతోపాటు.. ఉపాధి కల్పనకు ముందడుగు పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుధవారం వ్యాఖ్యానించారు.

ఈ నగరాలకు ఎఫ్‌ఎం

ఆదిలాబాద్‌, కొత్తగూడెం వంటి వెనకబడిన నగరాలు/పట్టణాలకు కూడా ఎఫ్‌ఎం సేవలు అందనున్నాయి. ఈ ప్రాంతాలకు యాస్పిరేషనల్‌ డిస్ర్టిక్ట్స్‌ కేటగిరీలో మూడేసి చొప్పున ఎఫ్‌ఎం చానళ్లు మంజూరయ్యాయి. కరీంనగర్‌, ఖమ్మం నగరాలతోపాటు.. మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నల్లగొండ, రామగుండం, సూర్యాపేట ప్రాంతాలకూ మూడేసి ఎఫ్‌ఎం స్టేషన్లు రానున్నాయి. నిజామాబాద్‌ నగరానికి మాత్రం నాలుగు చానల్స్‌ను కేటాయించారు.

Exit mobile version