Site icon PRASHNA AYUDHAM

కబ్జాలకు గురైన చెరువులపై దృష్టి పెట్టాలి

IMG 20240827 WA0386

కబ్జాలకు గురైన చెరువులపై దృష్టి పెట్టాలి

బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్

గజ్వేల్ ఆగస్టు 27 ప్రశ్న ఆయుధం :

చెరువుల కబ్జాలపై హైదరాబాద్ నగరంలో దూకుడు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో కూడా చెరువుల పునరుద్ధరణకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ టి ఎల్, బంపర్ జోన్లను చదును చేసి సగానికి పైగా తగ్గించిన చెరువుల విస్తీర్ణం అయినా చోద్యం చూస్తున్న అధికారులు మున్సిపల్ పాలకవర్గం మమ్ములను ఎవరు సంప్రదించ లేదు ఫిర్యాదు చేయలేదని చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు ఈరాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కలెక్టర్ ద్వారా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గజ్వేల్ ప్రాంతంలోనే పెద్ద చెరువు అయినా పాండవుల చెరువు 104 ఎకరాల విస్తీర్ణం కానీ ఇప్పుడు 49 ఎకరాల విస్తీర్ణంలోనే చెరువు ఉన్నది గజ్వేల్ పట్టణంలో పాండవుల చెరువు రైతు పంటలకు జీవనాధారంగా ఉండేది ప్రస్తుతం ఎఫ్ టి ఎల్ బంపర్ జోన్ల ను మట్టితో చదును చేసి వెంచర్లు ప్లాట్లు చేశారు. చేపల పెంపకం తో మత్స్యకారులకు ఉపాధి కల్పించిన చెరువు ఇప్పుడు విస్తీర్ణం సగానికి పైగా తగ్గింది. అయినా మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం పట్టనట్టుగా వ్యవవరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ పాలకవర్గం 6 కోట్లతో పాండవుల చెరువు మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని చెప్పిన నీటి నిల్వకు భూమి లేదు ఆ పనులు కూడ పూర్తిగా నీరు పోయాయి కావున వెంటనే మున్సిపల్ పాలకవర్గం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాం లేనియెడల గజ్వేల్ ప్రాంతం లో ఉన్న చెరువుల రక్షణకై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఐల మహేందర్,బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, చెప్యాల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version