ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలి..
స్థానిక భద్రాచలం పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి కార్యాలయం ఆవరణలో వికలాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ సమావేశానికి పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కోమగిరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ హేతువాది,సామాజిక ఉద్యమ నాయకులు, డాక్టర్ భాను ప్రసాద్, ఈటె రాజేశ్వరరావు లు పాల్గొని మాట్లాడుతూ…. సమాజంలోని మానసిక వికలాంగుల పట్ల, వృద్ధుల పట్ల పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం చేయలేని పనిని కూడా తమకున్న దాంట్లో సేవా సమితి చేస్తుందని కొనియాడారు. ప్రభుత్వం బాధ్యతగా వృద్ధుల, వితంతుల పట్ల లేకపోవడం వల్ల వచ్చే పెన్షన్లు సరిపోక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకుంటూ ముందుకు వెళ్తున్న పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు, వితంతులకు పెంచిన పెన్షన్ వెంటనే విడుదల చేయాలని కోరారు. వికలాంగుల వృద్ధుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత వహించాలని వారు అన్నారు. పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి చేస్తున్న మానవత విలువలు కలిగిన ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమకున్న దాంట్లో కొంత తోడ్పాటుని పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితికి అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయుడు, మహాజన మహిళ సమైక్య ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి సభ్యులు లంక యుగంధర్ రావు, అప్పన్న దాసు బాబు, భూక్య కిషన్, బొక్క పున్నమయ్య, బర్ల జాన్ కుమార్, మారం ఈశ్వర్ రెడ్డి, కోట ప్రభాకర్ రావు, కనుక వెంకటేశ్వర్లు, విష్ణు, భూకే శిల్ప, తలపాల అప్పారావు, కంభంపాటి రాజా, తదితరులు పాల్గొన్నారు