Site icon PRASHNA AYUDHAM

ఫుడ్ ఇన్ స్పెక్టర్ తనిఖీలు

IMG 20240724 WA1709

బిర్యానీ పాయింట్ లో ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత తనిఖీలు- శాంపిల్స్ సేకరణ*

జమ్మికుంట ప్రశ్న ఆయుధం జులై 24

కరీంనగర్ జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత బుధవారం జమ్మికుంట పట్టణంలోనీ ఆర్ టి బిర్యానీ పాయింట్ లో తనిఖీలు చేశారు. సదరు హోటల్ లో బిర్యాని పై ఫిర్యాదు రాగా జమ్మికుంటకు వచ్చి శాంపిల్స్ ను సేకరించినట్టు ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు శాంపిల్స్ ను టెస్టింగ్ కోసం హైదరాబాద్ కు ల్యాబ్ కు పంపించినట్టు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు 25 రోజుల్లో వస్తాయని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోకి ఫుడ్ ఇన్ స్పెక్టర్ వచ్చిన విషయం తెలుసుకొని పట్టణంలోని పలు హోటళ్లను నిర్వాహకులు మూసివేశారు. మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని మరోసారి హోటళ్లను విస్తృతంగా తనిఖీ చేయనున్నట్టు ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత స్పష్టం చేశారు. స్థానికంగా హోటల్ నిర్వాహకులకు సమాచారమిచ్చి మున్సిపల్ విభాగ సమన్వయంతో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత వెల్లడించారు మున్సిపల్ శాఖ సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తే ఒకే సమయంలో శాంపిల్స్ సేకరణతో పాటు అపరిశుభ్రతపై మునిసిపల్ శాఖ వారు జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు

Exit mobile version