Site icon PRASHNA AYUDHAM

ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం

IMG 20251202 192232

ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం

కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థత

ఒకరి పరిస్థితి విషమం

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 2 

గద్వాల: జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఆహార విషబాధ కలకలం రేపింది. మంగళవారం ఉదయం టిఫిన్ చేసిన 15 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ… టిఫిన్‌గా ఇచ్చిన ఉప్మాలో పురుగులు కనిపించాయని, ఈ విషయం వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. అనంతరం అరటిపళ్లూ, బిస్కెట్లు తిని పాఠశాలకు వెళ్లిన తర్వాతే అస్వస్థత మొదలైందని చెప్పారు. హాస్టల్ ఆహార నాణ్యతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version