Site icon PRASHNA AYUDHAM

ఘనంగా లక్ష్మక్క జయంతి వేడుకలకు

IMG 20240930 WA0004 1

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 30 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో సోమన్న గారి లక్ష్మక్క జయంతి వేడుకలకు శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు. ఘనంగా నిర్వహించారు అనంతరం శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నర్సపూర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన మహిళా నాయకురాలు, బి ఎస్పీ పార్టీ ద్వారా బహుజనుల కొరకు అవర్నిశలు పరితపించిన వ్యక్తి సోమన్న గారి లక్ష్మక్క అని కొనియాడారు. అనంతరం ఆమె ఫోటోకు శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ కొడకంచి సుదర్శన్ గౌడ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, బండారి గంగాధర్ మరియు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version