ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆతిశీ వ్యాఖ్యలు
నెలలు భరతుడిలా పాలన! కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యేదాకా.
ఆయన కుర్చీ అలాగే ఉంటుంది సీఎం ఆఫీసులో రెండో కుర్చీ.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆమె.. పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో సన్నివేశాన్ని ప్రస్తావించారు. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు రాజ్యాన్ని ఏలాల్సి వచ్చిందన్నారు. అప్పుడాయన రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి బాధ్యతలు నెరవేర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తనదీ అదే పరిస్థితి అని ఆతిశీ చెప్పారు. భరతుడి స్ఫూర్తితోనే తాను నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు.త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని, అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు…
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది