భూమికోసం భుక్తికోసం దేశవిముక్తి కోసం

కోసం
Headlines (Telugu)
  1. అమరవీరుల సంస్మరణ సభలో సిపిఐ ఎంఎల్ నాయకుల ప్రసంగం
  2. విప్లవోద్యమంలో చేసిన త్యాగాల గుర్తింపు
  3. భూమి హక్కుల కోసం పోరాటాలు అవసరం

ప్రస్తుతం ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు అరుణ అరుణ జోహార్లు అర్పిస్తూ నవంబర్ఒకటి నుండి తొమ్మిది వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించుటలో భాగంగా ఈరోజు ఉదయం బాలాజీ పేటలో కామ్రేడ్ ఎర్రమళ్ళ ఎర్రన్న స్మారక స్తూపం పై కామ్రేడ్ ఎర్రమళ్ళ చిన్న వెంకన్న జెండా ఆవిష్కరించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కామ్రేడ్ తోకల వెంకన్న అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ గౌని ఐలయ్య అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి బుక్తి పీడిత ప్రజా విముక్తి కోసం ఆ సమాన త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు కమ్యూనిస్టుల దాన్వారు అన్నారువారు అన్నారు.నయా రివిజనిజంతో తగదెంపులు వేసుకొని కామ్రేడ్ చార్ ముజుందార్ సత్యనారాయణ సింగ్. తరిమెల నాగిరెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు.కొల్లా వెంకయ్య. మాదాల నారాయణస్వామి తదితరులు భారత విప్లవోద్యమ నిర్మాణానికి పునాదులు వేశారు.1969 లో సిపిఐ ఎంఎల్ పార్టీగా ఆవిర్భవించి. వీరోచిత రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగిన తెలంగాణ నక్సల్ బరి పిలుపుతో నిప్పురవై మండింది. ప్రతిఘటనా పోరాటపంద గోదావరి లోయ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను పరుగులెత్తించింది కమ్యూనిస్టు విప్లవకారులు ఐదు దశాబ్దాలకు పైగా రాజ్యాన్ని సవాల్ చేస్తూ పీడిత ప్రజల తరఫున ప్రతిఘట నా ఉద్యమాన్ని నడిపించి లక్షాధి ఎకరాల పోడు.బంజరు భూములను ప్రజల పరం చేసిన చరిత్ర కమ్యూనిస్టు విప్లవకార్లదని వారు అన్నారు. ప్రజాయుద్ధపందమార్గమే ఈ దేశంలో దోపిడీ. పీడన అణిచివేత. అసమానతలు లేనినవ సమాజ నిర్మాణానికి సరైనమార్గమని చాటి చెప్పి గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాల్ని నిర్మించి. జాగిరి దారి. జమీందారీ. పటేల్. పట్వారి. భూస్వాముల. పెత్తందారుల దోపిడి. దౌర్జన్యాలను అరికట్టి. దొర బాంచన్ అన్న ప్రజల్ని చైతన్యపరిచి ప్రశ్నించే.పోరాడేతత్వాన్ని నేర్పడం జరిగిందన్నారు. నేడు దేశంలో హిందుత్వ మతోన్మాదం ఆదివాసీల పైన. దళితులు .మైనార్టీ ప్రజల పైన దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తూ అది వాసి ప్రాంతాల్లో ఉన్న కనీసంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ఆదివాసీలను అడవుల నుండి వెళ్ళగొట్టడానికి మారణ హోమాన్ని సృష్టిస్తుందని వారన్నారు. ఇలాంటి స్థితిలో విప్లవకారులుఐక్యంగా సమరశీల ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాల్సినఅవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అలాంటి పోరాటాలు నిర్వహించినప్పుడు మాత్రమే కామ్రేడ్ ఎర్రమల్ల ఎర్రన్న. గుడిబోయినరాఘవులు. వెంకటేష్ విప్లవోద్యమ అమరవీరులకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు. ఈ సంస్మరణ సభలో బయ్యారం ఎస్ డి ఎల్ సి నాయకులు రామచంద్రుల మురళి.గుడి బోయిన రమేష్. నిమ్మరబోయిన సహదేవ్ ఎర్రమల్ల పెద్ద వెంకన్న.గంగరబోయిన రమణయ్య.ఖుషిని వెంకన్న.దొడ్డి తిరుమలేష్ . ఈడబోయిన వీరభద్రం. ఎర్రమళ్ళ మంగమ్మ .ఈ ఏర్ని రాజేష్. కొత్త సికేస్. ఈడ పోయిన సుగుణ. బినాగేశ్వరరావు.గోవర్ధన్. మోదుగుల నరసయ్య. దేశ బోయిన వెంకటనారాయణ. సురబోయిన సత్యం. తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now