దేశ చరిత్రలోనే తొలిసారి – క్యూలైన్లలో నిలబడి రాజధానికి భూములిచ్చిన రైతులు

*దేశ చరిత్రలోనే తొలిసారి – క్యూలైన్లలో నిలబడి రాజధానికి భూములిచ్చిన రైతులు*

అమరావతి

విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రాజధానికి ప్రభుత్వం భూసమీకరణ – కేవలం 58 రోజుల వ్యవధిలో 34 వేల ఎకరాలకు పైగా భూసమీకరణ

అనతికాలంలోనే అమరావతి పేరే ఒక ‘బ్రాండ్‌ నేమ్‌’గా మారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఆధునిక మహా నగర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి వివిధ దేశాలు, సంస్థలు ఆసక్తిగా ముందుకు వచ్చాయి. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు సింగపూర్‌ ప్రభుత్వం రాజధాని, కోర్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చింది. పరిపాలన నగరం ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు, సచివాలయ టవర్ల డిజైన్లను లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించింది. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కన్సార్షియంతో ఒప్పందం జరిగింది.

రాబోయే కొన్నేళ్లలో అక్కడ ఉద్ధృతంగా జరిగే నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, భూముల ధరలు బాగా పెరిగాక సీఆర్‌డీఏ దగ్గరున్న భూముల్ని విక్రయిచడం ద్వారా వచ్చే ఆదాయంతోనే అమరావతి నిర్మాణానికి అవసరమైన మిగతా వనరుల్ని సమకూర్చుకోవాలన్ని ప్రభుత్వం యోచన. అక్కడి నుంచి వచ్చే ఆదాయంతోనే రుణాలు కూడా తీర్చనున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించడం ద్వారా ఇవారి త్యాగాలకు ప్రభుత్వం ప్రతిఫలం అందిస్తోంది

Join WhatsApp

Join Now