న్యాయవాదులకు ఫోరెన్సిక్ మీద అవగాహన సదస్సు.

న్యాయవాదులకు ఫోరెన్సిక్ మీద అవగాహన సదస్సు

.గజ్వేల్  బార్అసోసియేషన్ అధ్యక్షుడు చెన్ రాజ్ పాండరి

గజ్వేల్ నవంబర్ 23 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ న్యాయవాదులకు ఫోరెన్సిక్ మీద అవగాహన కోసం ప్రోబ్ ల్యాబ్ డైరెక్టర్ మోహన్ ఎర్రోళ్ల గారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గజ్వెల్ శ్రీమతి ప్రియాంక హాజరైనారు. ఈ సందర్బంగా గజ్వెల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండరి మాట్లాడుతూ మన న్యాయవాదులకు క్రిమినల్ , సివిల్ కేస్ లలో ఫోరెన్సిక్ లో భాగమైన డాక్యుమెంట్లోని సంతకాల ఫోర్జరీ, డిజిటల్ లో భాగమైన సి సి ఫుటేజ్, ఫేస్ మార్ఫింగ్ మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన జడ్జ్ గారు మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు న్యాయవాదులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పినారు. అలాగే న్యాయవాదుల కోసం ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తే జూనియర్ న్యాయవాదులకు ఎంతో మేలు జరుగుతుందని బార్ అధ్యక్షుడు పండరి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు హాజరై హర్ష వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment