శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి అక్షింతల తయారీకి వడ్లు పంపించిన అడవి చెల్పూర్ వాసి

*శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి అక్షింతల తయారీకి వడ్లు పంపించిన అడవి చెల్పూర్ వాసి*

*ఇల్లందకుంట డిసెంబర్ 29 ప్రశ్న ఆయుధం*

అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణానికి జయశంకర్ జిల్లా అడవి చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీ రామదాసు భక్త మండలి రామదాసు తిరుపతి స్వయంగా వరి పంట పండించిన వడ్లను శ్రీరామనవమి శ్రీ సీతారాముల కల్యాణానికి గోటితో ఓలువడానికి శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి జమ్మికుంట వారికి ఆదివారం రోజున అందజేశారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా తయారు చేసే స్వామివారి అక్షింతల తయారీ మా సేవా సంఘం ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు భక్తి భావంతో చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాణాధికారి అర్చకులు శేషం రామాచార్యులు శేషం వంశీధరఆచార్యులు సిబ్బంది మోహన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now