*అటవీ సంరక్షణ జీవకోటి పరిరక్షణ*
*-అడవుల సంరక్షణ పై అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు*
*-పాల్గొన్న అక్షర స్కూల్ విద్యార్థులు*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిది 22-04-2025 (ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
స్థానిక కురుపాం లో గల అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు కురుపాం అటవీ శాఖ అధికారులు పెద్దకొండ రిజర్వు ఫారెస్ట్ కు తీస్కొని వెళ్లారు.అనంతరం అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అటవీ సంరక్షణ తో నే జీవకోటి పరిరక్షణ సాధ్యమవుతుందని కనుక అడవులను ఏ విధంగా పరిరక్షించుకోవాలి,అక్కడ జరుగుతున్న పనులు తదితర విషయాలపై పిల్లలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో అటవీ పరిధి అధికారి D. గంగరాజు మరియు అటవీ శాఖ సిబ్బంది, అక్షర స్కూల్ చైర్మన్ P.సంతోష్ కుమార్ మధు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.