అటవీ భూమి ఆక్రమణ
— మాచారెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వప్న
కామారెడ్డి ప్రతినిధి జూలై 12.
మాచారెడ్డి మండల కేంద్రంలోని అక్కాపూర్ గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలోని భూమిని అక్రమంగా చదును చేసి నారు వేయడానికి మడులు కట్టి చదును చేశారు. ఇట్టి విషయాన్ని గమనించిన స్థానిక బీట్ ఆఫీసర్ స్వప్న స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసి ఎవరైనా చెట్లు నరికిన అక్రమంగా భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం పై దర్యాప్తు చేయబడునని తెలిపారు.