*విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు*
సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, రామచంద్రాపురం మండల శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమంలో భాగంగా సింగూర్ డ్యాం సందర్శించారు. సింగూర్ డ్యాంలో ఉన్న జల సంపదను చూసి వయోవృద్ధులైన విశ్రాంత ఉద్యోగులు తన్మయత్వంలో మునిగి తేలారు. మార్గ మధ్యలో సంగారెడ్డి సమీపంలోని వైకుంఠ పురంలో గల వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసం కల్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, తరచుగా ఈలాంటి కార్రక్రమాలు నిర్వహించుకోవాన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల రామచంద్రాపురం మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి సియచ్.రాములు, ఆర్థిక కార్యదర్శి బస్వరాజు,ప్రచార కార్యదర్శి టి.ప్రతాప రెడ్డి,ఆర్.ప్రకాశ్, రాంచంద్రయ్యలు చురుకైన పాత్ర పోషించినారని వారిని సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇతర బాధ్యులు పి.విశ్వనాథ రావు,సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, మాణయ్య, రామశాస్త్రి, విఠలాచారి, పోచయ్య, సంపత్ కుమార్, సంగసాని యాదయ్య, బుచ్చిరెడ్డి కిషన్, శంకర్, బాపురావు జోషి,రామారావు తదితరులు పాల్గొన్నారు.