అటవీ రక్షణ అందరి బాధ్యత

IMG 20240911 WA2117 IMG 20240911 WA2115

 అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం పిలుపు                                      

 భద్రాచలం : మానవాళి మనుగడకు ప్రాణవాయువు అందిస్తూ, సకల జనుల హితం కోరుతున్న అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య  పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ బుధవారం హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అడవిని కాపాడుతూ చక్కని విధులు నిర్వహిస్తున్న అటవీ ఉద్యోగుల సేవలను గుర్తు చేశారు. అమరులైన అటవీ ఉద్యోగులకు నివాళులర్పించారు. అడవిని మనం కాపాడితే, అవి మనకు రక్షణ ఇస్తాయని, భావితరాలకు అండగా నిలుస్తాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై ప్రధాన దృష్టి సారించి, నర్సరీల పెంపకం చేపడుతోందని తెలిపారు. వన్యప్రాణులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల పెంపకం వాటి ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం  డోబ్రీయల్ పీసీసీ ఎఫ్ తెలంగాణ , డా మేరు పీసీసీఫ్వి జిలన్స్,డా సువర్ణ పీసీసీఫ్అ డ్మిన్, డా ప్రియాంక వర్గీస్ సీసీఫ్ , డా రామలింగం సీసీఫ్ప్రొ డక్షన్, ఎస్ జె ఆశ  సీసీఫ్ ఎస్ రాంబాబు డీసీఫ్ , మెండెం జయరాజు , రౌతు నరసింహారావు  తదితర రిటైర్డ్ అటువై శాఖ ముఖ్య అధికారులు, ప్రస్తుత అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితర ముఖ్యలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now