*ఏపీ లో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు..*
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది.
ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.