Site icon PRASHNA AYUDHAM

పోర్టు కబ్జాలో మాజీ ఏజీ, సుప్రీం రిటైర్డ్ జడ్జిని ఇరికిస్తున్న జగన్ గ్రూప్ !

IMG 20250219 WA0086

*పోర్టు కబ్జాలో మాజీ ఏజీ, సుప్రీం రిటైర్డ్ జడ్జిని ఇరికిస్తున్న జగన్ గ్రూప్ !*

జగన్ మోహన్ రెడ్డి క్రిమినాలిజీ ఎంత భయంకరంగా ఉంటుందో..ఆయన ఇతరులను వాడుకునే విధంగా ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరోసారి బయటపడింది. కాకినాడ పోర్టును అధికారం అడ్డం పెట్టుకుని మాఫియాలాగా కబ్జా చేసిన వ్యవహారంలోకి మాజీ ఏజీ. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా వారి పేర్లు వాడేశారు.

పోర్టును కబ్జా చేయడానికి ముందుగా ఓ ప్రైవేటు ఆడిటింగ్ సంస్థను దింపి.. అక్రమాలకు పాల్పడ్డారని రూ. 965 కోట్లు జరిమానా వేశారు. తర్వాత డీల్ పూర్తయిన తర్వాత దాన్ని 9 కోట్లుగా మార్చారు. ఇక్కడే అసలు గ్యాంబ్లింగ్ జరిగింది. ఎందుకు ఇలా చేశారని.. అంటే.. ఇప్పుడు మాజీ ఏజీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సలహా తీసుకుని అలా తగ్గించామని .. జగన్ గ్రూపు తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అసలు ఇలాంటి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో వారికేం సంబంధం?

అంటే.. పోర్టును కబ్జా చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం వారిని కూడా ఉపయోగించుకున్నారు. ఏదైనా తేడా వస్తే వారిని కూడా ఇరికించేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నమాట. అడ్జగోలు దోపిడీ చేసింది కాకుండా.. జగన్ పంచన చేరినందుకు ఏజీని.. సుప్రీంకోర్టు రిటైల్డ్ జడ్జీని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇంతకీ ఆ ఏజీ.. సుప్రీం రిటైర్డ్ జడ్జిలు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

Exit mobile version