నాగారంలో కార్మిక దినోత్సవ వేడుకలు – పాల్గొన్న మాజీ చైర్మన్, కౌన్సిలర్లు

*నాగారంలో కార్మిక దినోత్సవ వేడుకలు – పాల్గొన్న మాజీ చైర్మన్, కౌన్సిలర్లు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 1

IMG 20250501 WA2946 మున్సిపాలిటీ సిబ్బంది భారతీయ మజ్దూర్ సంఘ్ (బి. ఎం .ఎస్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, గూడూరు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

మున్సిపాలిటీకి చెందిన పలువురు కార్మికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వారికి ప్రత్యేకంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు కార్మికుల యొక్క శ్రమను కొనియాడారు మరియు వారి హక్కుల ప్రాముఖ్యతను వివరించారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now